యువకుడి మృతిపై మిస్టరీ!
12-10-2026 | 10:58am
కరకగూడెం, అక్టోబర్ 12 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలవలనాగారంలో బరావత్ రవిచంద్ర అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigation) చేపట్టినట్లు తెలిసింది. యువకుడి మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయిన అనంతరం మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.