ఫోన్ కొనడానికి ఇదే లాస్ట్ ఛాన్స్

29-10-2026 | 12:40pm

Ai+ ఫోన్ల ధరలు రూ.3,000 వరకు పెంపు!

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి Ai+ Smartphone కీలక సమాచారం వెల్లడించింది. తన Smartphone Portfolioలోని ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు నవంబర్ 15, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.3,000 వరకు Price Hike ఉండనుంది. దీంతో కొత్త ఫోన్ కొనాలనుకునే వినియోగదారులు ప్రస్తుత ధరలకే కొనుగోలు చేసేందుకు నవంబర్ 14 వరకు అవకాశం ఉంది.

పెరుగుతున్న ఖర్చులే కారణం

స్మార్ట్‌ఫోన్ తయారీకి అవసరమైన Components, ఇతర Input Costs అధికంగా కొనసాగుతున్నాయని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా తక్కువ ధరల విభాగంలో వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఫోన్లను రూపొందించడం సవాలుగా మారుతోందని పేర్కొంది. ధరలను అందుబాటులో ఉంచడంతో పాటు Product Experience విషయంలో రాజీ పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. Ai+ ఫోన్లను ప్రస్తుత ధరలకే కొనుగోలు చేయాలనుకునేవారు నవంబర్ 14లోపు తమకు నచ్చిన మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 15 నుంచి Revised Pricing అమల్లోకి వస్తుంది. అయితే ఏయే మోడళ్లపై ఎంత ధర పెరుగుతుందనే పూర్తి వివరాలను కంపెనీ ప్రకటనలో వెల్లడించలేదు. కొనుగోలుదారులు తమకు నచ్చిన ఫోన్ ధరను అధికారిక విక్రయ వేదికల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు