నిరుద్యోగులకు శుభవార్త

29-10-2026 | 08:10am

డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. TGPSC Jobs 2026.. నవంబర్ 27 వరకు ఛాన్స్!

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ శాఖలో ఖాళీల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (Mandal Planning and Statistical Officers), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (Assistant Statistical Officers) పోస్టులు కలిపి మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నియామకాలు Zonal Cadre పరిధిలో చేపట్టనున్నారు. డిగ్రీలో Statisticsను ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు విద్యార్హతలు, ఇతర Eligibility Criteriaను పరిశీలించి అప్లికేషన్ సమర్పించాలి.

నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 30 నుంచి ప్రారంభమై నవంబర్ 27 వరకు కొనసాగనుంది. అభ్యర్థుల వయోపరిమితిని 18 నుంచి 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. వయో సడలింపులు, ఇతర అర్హతలు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాల కోసం అధికారిక Notificationలోని నిబంధనలను పరిశీలించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు Application Datesను గమనించి, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.


మరిన్ని వార్తలు