బంగారం కొనేవారికి గుడ్న్యూస్
బంగారం, వెండి ధరల్లో (Gold & Silver Prices) ఊహించని విధంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు ధరలు తగ్గితే.. మరుసటి రోజే భారీగా పెరుగుతూ మార్కెట్లో (Market) తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అయితే గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు కాస్త దిగి వస్తుండటం వినియోగదారులకు ఊరటనిస్తోంది.ముఖ్యంగా గత రెండు రోజుల్లో బంగారం ధరలు (Gold Rates) తులానికి సుమారు రూ.1,000 వరకు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం ధరల పరిస్థితి కొంత అనుకూలంగా మారింది.
హైదరాబాద్లో (Hyderabad) ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,180గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,750గా కొనసాగుతోంది.బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో (Silver Rates) కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ (International Market) పరిస్థితులు, డాలర్ విలువ, దేశీయంగా కొనుగోళ్ల డిమాండ్ వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినప్పటికీ.. రానున్న రోజుల్లో మార్కెట్ ట్రెండ్ (Market Trend) ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ధరలు మరింత తగ్గుతాయా.. లేక మళ్లీ పెరుగుతాయా అన్నదానిపై వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.