ఈవీ కారులో మంటలు.. నలుగురు మృతి
ఈవీ కారులో చెలరేగిన మంటలు.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
విజయవాడ: విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు(Vijayawada West Bypass Road)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనం (Electric vehicle)లో మంటలు చెలరేగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్నవారు బయటకు వచ్చేలోపే మంటలు తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించగా, ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు మృతులను విజయవాడ సమీపంలోని నున్న, గుంటూరు జిల్లా నంబూరు ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా నంబూరులో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Vijayawada bypass tragedy: Four burnt alive as EV catches fire Four people were burnt alive after an 𝐞𝐥𝐞𝐜𝐭𝐫𝐢𝐜 𝐯𝐞𝐡𝐢𝐜𝐥𝐞 (𝐄𝐕) 𝐜𝐚𝐫 𝐜𝐚𝐮𝐠𝐡𝐭 𝐟𝐢𝐫𝐞 following a collision with a road divider on the Vijayawada West Bypass in NTR district. Another person sustained serious injuries and is in critical condition. The car was completely gutted in the fire, and all four occupants died at the scene. The victims were returning after attending a family function in Namburu when the accident occurred. The deceased have been identified as residents of Nunna and Namburu. Those killed include Kommareddy Ramdev, 39, of Nunna, his mother Aruna, Tiguru Vijaya of Namburu and a child. Police launch rescue operations at accident site Local residents rushed the injured person to hospital for treatment. Family members reached the accident site and broke down on seeing the scene. Police arrived after receiving information about the accident and launched rescue operations. Further details awaited. #Vijayawada #EV #AndhraPradesh
— Sudhakar Udumula (@sudhakarudumula) October 12, 2026