పిట్టంపల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం.

12-10-2026 | 08:09pm

500 మందికి వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ.

చిట్యాల,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల(Lions Club of Chityala), యశోద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మలక్‌పేట్ సంయుక్త ఆధ్వర్యంలో చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామం(Pittampalli Village)లోని పాఠశాల ఆవరణలో సోమవారం మెగా ఉచిత వైద్య శిబిరం(Free Medical Camp) నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 500 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ విభాగాలతో పాటు కంటి పరీక్షలు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా లయన్ మదన్‌మోహన్ రేపాల పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా గ్రామ సర్పంచ్ శ్రీమతి అందే అండాలు రాములు, ఉపసర్పంచ్ నారగోని నాగరాజు, జోనల్ చైర్‌పర్సన్ సంజీవరెడ్డి, చార్టర్ ప్రెసిడెంట్ లయన్ రవీందర్ గౌడ్ జనగాం, క్లబ్ అధ్యక్షులు లయన్ నర్సింహా గౌడ్, రేగులగడ్డ, కార్యదర్శి లయన్ మాధవ రెడ్డి పాటి, కోశాధికారి లయన్ కరుణాకర్ గౌడ్ పంతంగి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు నిర్వహించిన ఈ శిబిరం విజయవంతం కావడంపై నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు