గణేశ్ లడ్డూకు రూ.20,116 రికార్డు ధర

20-09-2026 | 12:18am

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సిర్పూర్(టి) మండల(Sirpur (T) Mandal) కేంద్రంలోని విద్యా గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం(Laddu Auction) పాటలో గణేశుడి లడ్డూ రూ.20,116 రికార్డు ధర పలికింది. ఈ లడ్డూను భట్టు రాజుబాయి దక్కించుకున్నారు. తొలిసారిగా బాలల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లోనే(Ganapati Celebrations) లడ్డూకు రూ.20 వేలకు పైగా ధర పలకడం విశేషం. లడ్డూ దక్కించుకున్న రాజుబాయికి పలువురు అభిమానులు, స్థానికులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు