డీసీఎం ఢీకొని ఇద్దరు మృతి

16-10-2026 | 12:55pm

ఒకరికి గాయాలు

సూర్యాపేట సమీపంలోని బాలెంల స్టేజి వద్ద ఘటన

సూర్యాపేట,(విజయక్రాంతి): వాకింగ్ కు వెళ్లిన ముగ్గురు వ్యక్తులను వెనుక నుండి వచ్చిన డీసీఎం వేగంగా ఢీ కొట్టిన ఘటన సూర్యాపేట(Suryapet ) సమీపంలోని బాలెంల స్టేజి(Balemla Stage) వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రం సైదులు, ఆలకుంట్ల నాగరాజు, గొల్ల జానయ్య అనే ముగ్గురు తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా బాలెంల స్టేజి సమీపంలో జనగాం వైపు నుంచి సూర్యాపేటకు వస్తున్న డీసీఎం వారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిందన్నారు.

ఈ ప్రమాదంలో గుర్రం సైదులు అక్కడికక్కడే మృతి చెందగా నాగరాజు. జానయ్యలను స్థానికులు వెంటనే సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారన్నారు. అయితే నాగరాజు చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. ప్రమాదంలో నాగరాజు రెండు కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. జానయ్య తలకు సైతం తీవ్ర గాయం కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. నిత్యం వాకింగ్ కు వెళ్లే గ్రామస్థులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో బాలెంలలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు