పాము కాటుతో మహిళా మృతి
30-09-2026 | 08:12pm
చేగుంట,(విజయక్రాంతి): పాముకాటుతో మహిళ మృతి చెందిన సంఘటన చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో పోటీ చేస్తుంది, చేగుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దేశెట్టి లక్ష్మి 40) తన వ్యవసాయ పొలం వద్ద, గడ్డి కోయుటకు వెళ్లాగా అక్కడ గడ్డి కోసే క్రమంలో గడ్డిలో ఏదో గుర్తుతెలియని పాము మృతిరాలి ఎడమ కాలు బొటన వేలు సమీపములో కరువగా, అది గ్రహించని మృతురాలు అక్కడే పొలం వద్ద చనిపోయినది ఇట్టి విషయములో మృతురాలి భర్త దేశెట్టి కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్సై చైతన్ కుమార్ రెడ్డి తెలిపారు.