విధి నిర్వహణలో రవీందర్ అంకితభావం

30-09-2026 | 08:17pm

విధి నిర్వహణలో రవీందర్ చూపిన అంకితభావం, క్రమశిక్షణ ప్రశంసనీయం : జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి 

ఉద్యోగ విరమణ పొందిన రవీందర్ కు జీఎం ఘన సన్మానం

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): విధి నిర్వహణలో రవీందర్ చూపిన అంకితభావం, క్రమశిక్షణ ప్రశంసనీయమని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి(GM Enugu Rajeshwar Reddy) అన్నారు. భూపాలపల్లి ఏరియాలో ఏరియా సేఫ్టీ అధికారిగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ(Retirement) పొందుతున్న మాటూరి రవీందర్ ను బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించగా జీఎం ముఖ్య అతిధిగా హాజరై రవీందర్ ను శాలువాతో సత్కరించి, బహుమతి అందచేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ... సింగరేణి సంస్థ(Singareni Company)లో రవీందర్  39 సంవత్సరాల సుదీర్ఘకాలం బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంస్థ అభివృద్ధికి చేసిన సేవలను అభినందించారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం రామన్ వి పాఠక్, ఏసిఎం‌ఓ డాక్టర్ పద్మజ, సివిల్ ఏజీఎం రవికుమార్, ఐఈడి ఏజీఎం, జోతి, కేటీకె ఓసీపీ 2 పీఓ శ్యామ్ సుందర్, కేటీకె 1గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, పర్సనల్ మేనేజర్  ఎస్ శ్యామ్ సుందర్ , ఎన్విరాన్‌మెంట్ అధికారి టి పోషమల్లు, అన్ని గనుల, డిపార్ట్మెంట్ల అధికారులు ఉద్యోగులు పాల్గొని రవీందర్ కు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు