గిల్ దూకుడు.. వన్డేల్లో 11వ సెంచరీ!

30-09-2026 | 08:43pm

గువాహాటి: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Indian captain Shubman Gill) బ్యాట్‌తో దుమ్మురేపాడు. బరిలోకి దిగినప్పటి నుంచి దూకుడుగా ఆడిన గిల్.. కేవలం 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. ఈ శతకంతో గిల్ వన్డే కెరీర్‌లో 11వ సెంచరీ నమోదు చేశాడు. వరుసగా రెండో వన్డేలోనూ శతకం సాధించడం విశేషం. తొలి వన్డేలో 110 పరుగులు చేసిన గిల్.. గువాహాటిలోనూ అదే జోరును కొనసాగించాడు.


మరిన్ని వార్తలు