రాహుల్ ప్రధాని కాగలరా!

04-10-2026 | 05:05am

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి న ఈ80 ఏళ్లకాలంలో ఇప్పటి వరకు 14మంది ప్రధానమంత్రులుగా బా ధ్యతలు నిర్వర్తించారు. మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ(Prime Minister Jawaharlal Nehru) నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భా రత్‌కు ఒకే కుటుంబం ముగ్గురు ప్రధానులను అందిస్తే, ఒకే పార్టీ నుంచి ఆరుగురు ప్రధానమంత్రులుగా సేవందించారు. ఇం తటి ఘనచరిత్ర ఉన్న కుటుంబానికి 1989 తర్వాత, పార్టీకి 2014 తర్వాత ప్రధానమంత్రి పీఠం దూరమైపోయింది.

గాంధీ కుటుంబం నుంచి నెహ్రూ, ఇందిరాగాం ధీ, రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రులుగా దే శాన్ని 38 సంవత్సరాలు పరిపాలించారు. రాజీవ్‌గాంధీ తర్వాత 2004లో సోనియాగాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశా లున్నా ఆమె జాతీయతపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పదవిని చేపట్టలేకపోయారు. కానీ, యూపీఏ చైర్‌పర్సన్‌గా తెర వెనుక ఉంచి ప్రభుత్వాన్ని నడిపారు అనే విమర్శలు వినిపించాయి.

గాంధీ కుటుం బం నుంచి రాజకీయ వారసుడిగా రంగ ప్రవేశం చేసి 2004లో అమేది లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన రాహుల్‌గాంధీ..  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు రెండు దశాబ్దాల తర్వాత లోక్‌సభ లో కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా, దేశ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా రు. ఈ నేపథ్యంలో 2029లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచి రాహుల్‌గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి.

సర్వేలు ఏం చెబుతున్నాయి?

భారత్‌లో అత్యున్నత చట్టసభ అయిన లోక్‌సభలో అధికారపక్షానికి 76 ఏళ్ల నరేంద్రమోదీ ప్రధానిగా నాయకత్వం వహిస్తుం టే, 56 ఏళ్ల రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా నేతృత్వం వహిస్తున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ గ్రాఫ్ రాజకీయంగా ఎవరికీ అందనంత ఎత్తుకు పెరిగింది. మరొక వైపు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోవటం వల్ల 2004 నుంచి లోక్‌స భకు రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తు న్నా జాతీయస్థాయిలో బలమైన నేతగా ఎదగలేకపోయారన్న విమర్శలున్నాయి.

కానీ, రాహుల్‌గాంధీ 2022లో చేపట్టిన భారత్ జోడో యాత్ర తరువాత జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాల్లో విజయం సాధించింది. రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలోని వివిధ సమస్యలపై నిరంతరాయంగా పోరాడటంతో రాజకీయంగా రాహుల్‌గాంధీ ఇమేజ్ పెరిగిం దనే చెప్పాలి.దేశంలో ఉన్న రాజకీయ సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు మోదీ తరువాత రాహుల్‌గాంధీ ప్రధాని కావటానికి ఎక్కు వ అవకాశాలున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థ.. ఎన్నికల సర్వే సంస్థతో సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారంగా ప్రధానమంత్రిగా ఎవరైతే బాగుంటుందనే ప్రశ్నకు జవాబుగా 48.7 శాతం మోదీకి, 27.1 శాతం రాహుల్‌గాంధీకి, 9.2 శాతం తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కి మద్దతు తెలిపారు.  ఈ సర్వేలో ప్రధానంగా గమనించాల్సిన విషయమేమిటంటే.. మొదటి సారి మోదీకి 50శాతం కంటే తక్కువ మద్దతు దక్కటం, మరొకవైపు రాహుల్‌గాంధీకి గత సంవత్సర కాలంగా 2శాతం అదనంగా మద్దతు పెరగటం విశేషం.

నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని ఉద్య మానికి నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కేకు కూడా ప్రధానమంత్రి ప్రపోజల్‌లో 1.3 శా తం మద్దతు లభించింది. రాహుల్‌గాంధీ, జోసెఫ్ విజయ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అభిజిత్ దీప్కే, అరవింద్ కేజ్రీవాల్‌కు కలిపి మొత్తం 41శాతం మద్దతు దక్క టం.. విపక్ష కూటమి బలం కూడా గణనీయంగా ఉన్నట్లుగానే భావించాలి. దేశం లో ప్రస్తుత పరిణామాలతోపాటు, ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తోడై ఆ బలం మ రింత పెరిగితే రాహుల్ ప్రధానిపీఠానికి మరింత దగ్గరయ్యే ఛాన్స్ ఏర్పడుతుంది.

సంఖ్యా బలం అనుకూలమేనా!

ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానా ల్లో 272 స్థానాలు గెలిచిన పార్టీ లేదా కూ టమి అధికారం చేపట్టగలుగుతుంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధించిన బీజే పీ..18వ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కేవ లం 240 స్థానాల్లోనే విజయం సాధించి ఎన్‌డీఏ పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 2004లో 145 స్థానాల్లో, 2009లో 206 స్థానాల్లో విజ యం సాధించిన కాంగ్రెస్..యూపీఏ మిత్ర పక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పా టుచేసింది.

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యంత బలహీనంగా కనపడుతున్న నేపథ్యంలో 19వలోక్‌సభ ఎన్నికల్లో 150 స్థానాల్లో విజయం సాధించగలిగితే, ఇండియా కూటమి మిత్రపక్షాలు మరొక 100కు పైగా సీట్లు గెలుచుకుంటే రాహుల్‌గాంధీ ప్రధాని పదవి చేపట్టగలుగుతా రు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, గుజరాత్, అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడితేనే లోక్‌సభలో బలం పెరుగుతుంది. తద్వారా రాహుల్ ప్రధాని కాగలుగుతారు.

ఈ ఎనిమిది రాష్ట్రాల్లో మొత్తం 198 ఎంపీ సీట్లు ఉండగా గత లోక్‌సభ ఎన్నికల్లో కాం గ్రెస్ కేవలం 48స్థానాల్లో మాత్రమే విజ యం సాధించింది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో డీ ఎంకే ఇండియా కూటమి నుంచి తప్పుకోగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఎన్‌సీపీ (పవార్)లో చీలిక రావటంతో ఇండియా కూటమి బలహీనపడింది. కాంగ్రెస్‌తో పా టు  కూటమి పార్టీలు బలపడితేనే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాగలుగుతారు.

బలమైన వ్యూహం తప్పనిసరి 

బీజేపీలాంటి శక్తివంతమైన పార్టీని ఎన్‌డీఏ లాంటి బలమైన కూటమిని ఓడిం చటానికి కాంగ్రెస్ బలమైన వ్యూహాలను రూపొందించుకోవాలి. 2024లో బీజేపీ తన ప్రభుత్వ పనితీరు కంటే రాజకీయ వ్యూహాలతోనే మూడో పర్యాయం అధికారంలోకి రాగలిగింది. అయితే గత మూడు, నాలుగు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వ హిస్తున్న 94మంది ఎంపీలపై సాధారణంగానే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి గెలుపు సా ధ్యం కాదన్న భావనతో, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేసి నాలుగో దఫా గెలుపొందే వ్యూహాలను బీజేపీ రూపొందించుకుంటుంది.

ఇండియా కూటమి నుం చి నితీష్‌కుమార్ వెళ్లిపోవడటం, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు పెట్టుకోకపోవడం, ఢిల్లీలో కలిసి పోటీ చేయకపోవ డం కాంగ్రెస్ రాజకీయ వైఫల్యంగానే చూ డాలి. కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీని గెలిపించాలి. ఆప్‌తో అవగా హనతో పనిచేసి గుజరాత్, పంజాబ్‌ల్లో విజయం సాధిస్తేనే కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ ప్రధానిని చేయగలుగుతుంది.

అటల్‌బిహారీ వాజ్‌పేయ్ లాగా రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేతగా ప్రత్యేకమై న గుర్తింపు తెచ్చుకోవాలి. మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా, ఆయన నేతృ త్వంలోని ఎన్‌డీఏ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దీంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ, అధికారంలోకి వస్తే ఏ వర్గాలకేం చేస్తామో స్పష్ట తనిస్తూ వ్యూహాన్ని అమలు చేయాలి. దా నికనుగుణంగా రాజకీయ వ్యూహాలను, ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే బీజే పీని ఓడించటం అంత తేలిక కాదు. రాహుల్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలనే కాంగ్రెస్ ఆకాంక్ష కూడా కార్యరూపందాల్చదు.

 అసిస్టెంట్ ప్రొఫెసర్ కేయూ, 9885465877


మరిన్ని వార్తలు