ఉపాధ్యాయుల పాత్రే కీలకం

04-10-2026 | 05:00am

ఉపాధ్యాయుడు లేని ఈ ప్రపంచా న్ని ఊహించడమే చాలా కష్టమైన విషయం.. అనాది నుండి నేటి ఆధునిక కాలం వరకూ ఈ భూమిపై మానవ వికాసానికి, అనేక రంగాల్లో అభివృద్ధికి, అంత రిక్ష పరిశోధనలు, అడ్వాన్డ్స్ టెక్నాలజీ ఆవిష్కరణలు.. ఆ మాటకొస్తే నేటి ప్రపంచాని కే సవాల్ విసురుతున్న ఆర్టిఫీషియల్ ఇం టెలిజెన్స్, డిజిటలైజేషన్, ఆటోమెషిన్, యానిమేషన్ ఇలా పలు అంశాలను అడుగడుగునా మానవ జీవితానికి నాగరీకరణ తోపాటు నవీకరణ చేస్తున్న ప్రతీ అం శం లో ఉపాధ్యాయుడు,

అధ్యాపకుడి పాత్ర కీలకమైనది. అందుచేతే ఈ భూమిపై దాదాపు అన్ని దేశాల్లో ఉపాధ్యాయుడికి చిరస్మరణీయమైన గుర్తింపు లభిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వమున్న దాదా పు అన్ని దేశాలు ప్రతీ ఏడాది అక్టోబర్ 5వ తేదీన అంతర్జాతీయ ఉపాధ్యాయ ది నోత్సవం(International Teachers' Day) జరిపేందుకు నిర్ణయించాయి. యునెస్కో, ఐఎల్‌ఓ సంయుక్తంగా ప్రపం చ వ్యాప్తంగా ఉపాధ్యాయ సంక్షేమం, సమస్యలు పరిష్కారం కోసం 1966 అక్టోబర్ 5వ తేదీన సమావేశం నిర్వహించి,

ఆనాడే చర్యలు చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. 1994 నుండి అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం ప్రారంభించారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయలోకానికి సంబంధించిన పలు విషయాలు పరిశీలించి, వారి అభివృద్ధికి, ఆవశ్యకతను గుర్తించి, ఈ డిజిటల్ యుగంలో కూడా ఉపాధ్యాయుడి పాత్ర కీలకం అని వివరించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు విషయాలు పరిశీలించడం సమయోచితంగా ఉంటుంది..

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బేసిక్ ఎడ్యుకేషన్ అందిపుచ్చుకోవాలని, ఐక్యరాజ్యసమితి తన ‘సుస్థిర అభి వృద్ధి లక్ష్యాల్లో (యస్‌డిజి) పేర్కొని, ప్రా ధాన్యత క్రమంలో 4గా నిర్ణయించుకున్న ది. ఈ క్రమంలో పైలక్ష్యం సాధించడానికి ఇంకా 44 మిలియన్ల ఉపాధ్యాయులు ప్రాథమిక, సెకండరీ స్థాయిలు బోధించడానికి అవసరమని గుర్తించింది. అధికంగా సబ్- సహారా ప్రాంతాల్లో పని చేయడానికే సుమారు 15 మిలియన్ల ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు.

ఇప్పటికే ప్రపం చవ్యాప్తంగా పబ్లిక్ రంగంలో సుమారు 94 మిలియన్ల(కోటి మంది) ఉపాధ్యాయు లు పనిచేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ఉపాధ్యాయుల భర్తీకి ప్రతీ ఏడాది సుమారు 120 బిలియన్ల అమెరికన్ డాలర్లు అవసరముందని అం చనా వేస్తున్నారు. అనగా దాదాపు ప్రతిదేశం తమతమ జిడిపిలో కనీసం 6శాతం నిధులు.ఈ సందర్భంగా ‘ఇథియోపియా’ లో ఈ ఏడాది నవంబర్ 22-, 23వ తేదీల్లో జరిగే ‘టీచర్ పాలసీ ఫోరం‘ కూడా దృష్టి సారించే అవకాశం ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయులకు అత్యంత వేతనాలు చెల్లించే దేశంగా ‘లక్సెంబర్గ్’ తదుపరి స్విట్జర్లాండ్, జర్మనీ, నెదర్లాం డ్స్ వంటి దేశాలు నిలవగా, అతి తక్కువ జీతాలు చెల్లించే జాబితాలో గ్రీస్, స్లోవేకియా, సబ్ సహారా దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ వంటివి ఉన్నాయి. ఇక ఎక్కువ గౌరవం (స్టేటస్) ఇచ్చే దేశంగా ‘చైనా’ ప్రాచుర్యం పొందింది. అదే సమయంలో ప్రపంచంలోనే అత్యధిక ఉపాధ్యాయులున్న దేశంగా చైనా నిలిచింది.

తదుపరి స్థానంలో ఇండి యా, ఇండోనేషియా, అమెరికా వంటి దేశాలున్నాయి. ప్రతీ 1000 మందికి రష్యాలో 173మంది ఉపాధ్యాయులుండ గా, ఐస్‌లాండ్‌లో 45 మంది, బాగా తక్కువగా టాంజానియాలో ఇద్దరు మాత్రమే  ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ప్రపంచంలోనే మంచి నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయులు బ్రిటన్‌లో 49 శాతం, అ మెరికాలో 47, రష్యాలో 44 శాతం మంది ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా టీచర్ స్టూ డెంట్ రేషియో పరిశీలిస్తే అభివృద్ధి చెం దిన దేశాల్లో 14:1 ప్రాథమికస్థాయిలో, 13:1 సెకండరీ స్థాయిలో ఉంది. మన దే శంలో ప్రాథమిక స్థాయిలో 19:1గా, సెకండరీ స్థాయిలో 21:1గా, ఇంటర్మీడియట్ స్థాయిలో 23:1గా, కళాశాల స్థాయిలో 19:1 ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నార్వే, గ్రీస్ వంటి దేశాల్లో ప్రతీ 10మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉం డగా, అమెరికా, మెక్సికోలో 16 నుంచి 30 మంది విద్యార్థులకు ఒకరే ఉండడం గమనించదగిన విషయం. ఇంకా బాధాకర మైన విషయం మనదేశంలో సుమారు 1,04,000 స్కూళ్లు ‘సింగిల్ టీచర్’తో న డుస్తున్నాయి.

వీటిలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మొదటి స్థానాల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం‘ గ్లోబల్ టీచర్ ప్రైజ్ విన్నర్’గా మ నదేశం నుంచి ‘రౌబుల్ నాగి‘ ఎన్నికయ్యారు. వీరు సుమారు 800 విద్యా కేంద్రాలను వెనుకబడిన ప్రాంతాల్లో, అల్పాదాయ వర్గాల ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, 10 లక్షలమంది విద్యార్థులకు చదువు అందించడంతోపాటు డ్రాప్ అవుట్ చిల్డ్రన్‌ను తిరిగి బడికి రప్పించడం చేశారు.

మనదేశంలో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతూ ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించడం 1962 నుంచి జరుగుతున్నది. అబ్దుల్ కలా మ్ కూడా మనదేశంలో ఉపాధ్యాయ స్థా యి నుంచి భారత రాష్ట్రపతిగా ఎదిగారు. ఇటీవల కేరళం రాష్ట్రానికి చెందిన శైలజా టీచర్ కూడా మంచి గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా నోబుల్ ఎడ్యుకేషన్ సి స్టంలో ఫిన్‌లాండ్, దక్షిణ కొరియా, సింగపూర్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇక మనదేశం 35వ ర్యాంకులో ఉండడం గమనార్హం.

ముఖ్యంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాల్లో ఉన్న టీచర్ల కొర త, నిధుల లేమి, తక్కువ జీతాలు, పనిభారం, పని ప్రదేశాల్లో పరిస్థితులపై చర్చిం చి తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యారంగానికి ఎక్కువ నిధు లు కేటాయించగలగాలి.గురువుల గౌరవం పెంచేందుకు కృషి చేయాలి. మారుతున్న కాలానికి అ నుగుణంగా శిక్షణ అవసరం. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి.

ముఖ్యంగా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి ఎక్కువ నిధులివ్వాలి. తరచూ విద్యారంగాన్ని ప్రయోగశాలలు గా మార్చకూడదు. ఉపాధ్యాయులపై యా ప్‌ల భారం తగ్గించాలి. బోధనేతర పనులు నుంచి ఉపశమనం కలిగించాలి. ఆర్థికపరమైన పరిపుష్టత కలిగించాలి. సిలబస్ భా రం తగ్గించాలి. టీచర్, విద్యార్థి నిష్పత్తి ఆదర్శంగా ఉండాలి. నిపుణులు, అనుభవంత మైన ఉపాధ్యాయులను విద్యాపరమైన వ్యవహారాల్లో భాగస్వామ్యం చేయాలి.

ప్రైవేటీకరణ నియంత్రణ చేయాలి. ప్రభు త్వరంగంలోనే విద్యారంగం ఉండేవిధంగా చూడాలి. టీచర్ల సమస్యలు పరిష్కరించాలి. ప్రశాంతమైన వాతావరణంలో పని చేయడానికి కృషిచేయాలి. అప్పుడు మా త్రమే నాణ్యమైన బోధన అందుతుంది. తద్వారా భవిష్యత్తులో మంచి సమాజాన్ని నిర్మించుకోవడంతోపాటు ప్రతిభావంతులైన విద్యార్థులు దేశానికి అందించబడ తారు. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థ సైతం ఆదర్శంగా తయారవుతుంది.

అభివృద్ధి చెందిన దేశం గా భారత్ అతి త్వరలో ఆవిష్కరణ జరుగుతుంది. సరైన విద్యా వ్యవస్థ, మంచి ఉపాధ్యాయుల ద్వారానే ఆయా దేశాల ప్రగతి, పురోగతి ఆధారపడి ఉంటుందని ప్రపంచ దేశాలు ఈ దినోత్సవం సందర్భంగా గ్రహించి, గుర్తించి ఉపాధ్యాయ సంక్షేమానికి కృషి చేయడానికి అంతర్జాతీయ పరంగా అన్ని దేశాలు యునెస్కో ఆధ్వర్యం లో నిర్మాణాత్మక విధానాలు రూపొం దించి అమలు చేయాలని ఆశిద్దాం.

ఈ ఆధునిక కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం మరెవ్వరూ ఉండరని అందరూ గ్రహించడం శ్రేయస్కరం. సమాజంలో ఉపాధ్యాయుడికి సముచితస్థానం కల్పించడానికి ప్రతీదేశం కంకణం కట్టుకోవాలి. జన జాగృతి చేసేవాడు, జ్ఞానం అందించేవాడు, ఉత్తమ సమాజాన్ని తీర్చిదిద్దేవాడు ఉపాధ్యాయుడు మాత్రమే.

 వ్యాసకర్త సెల్: 9390509791

మరిన్ని వార్తలు