ఎలుగుబంటి దాడిలో రైతు మృతి

23-10-2026 | 02:57pm

జనగామ ఏరియా ఆసుపత్రికి తరలింపు

జనగామ, (బచ్చన్నపేట) అక్టోబర్ 23 (విజయక్రాంతి): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామ(Kodavaturu village) శివారులో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. ఎలుగుబంటి(Bear) దాడిలో రైతు మృతి చెందాడు. కొడవటూరు గ్రామానికి చెందిన రైతు మిన్నాలపురం సిద్దయ్య (60) శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో వ్యవసాయ పనుల నిమిత్తం తన పొలం వద్దకు వెళ్లగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది.

ఈ దాడిలో సిద్దయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో అడవి జంతువుల సంచారం పెరిగిందని, అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

మరిన్ని వార్తలు