క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
మండల స్థాయి క్రీడాకారుల ఎంపికలు
గణపురం, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్(Sarpanch Katkuri Radhika Srinivas) అన్నారు. మండల స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు.
మండల క్రీడా సమాఖ్య చైర్మన్ ఎండీ. అఫ్రోజ్ అహ్మద్, కార్యదర్శి కోసరి సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికలకు మండలంలోని పలు పాఠశాలల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పద్నాలుగు సంవత్సరాలలోపు, పదిహేడు సంవత్సరాలలోపు బాలబాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లాస్థాయి పోటీలకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.