విద్యుత్‌ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి

30-09-2026 | 06:42pm

సబ్‌స్టేషన్ల స్థలాలు, విద్యుత్‌ మౌలిక వసతుల పనుల పరిశీలనలో : సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి 

భూపాలపల్లి,(విజయక్రాంతి): సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేసి, పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి(CMD Karnati Varun Reddy) సూచించారు. భూపాలపల్లి సర్కిల్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో బుధవారం ఆయన విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

ములుగు గణపురం

గాంధీనగర్లో  ప్రతిపాదిత నూతన సబ్‌స్టేషన్ల కోసం గుర్తించిన స్థలాలను పరిశీలించారు. అనంతరం భూపాలపల్లి పరిధిలోని మంజూర్‌నగర్ వద్ద ప్రతిపాదిత సబ్‌స్టేషన్‌ స్థలాన్ని అనంతరం భూపాలపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ సబ్‌స్టేషన్‌లో పనిచేసే సమయంలో తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని, ఎల్ సి యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, విద్యుత్‌ సరఫరాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

భూపాలపల్లి, నందిగామ కవర్డ్‌ కండక్టర్‌ పనులు

విద్యుత్ అంతరాయాలు నివారించడానికి భూపాలపల్లి నుంచి నందిగామ వరకు చేపడుతున్న కవర్డ్‌ కండక్టర్‌ ఏర్పాటు పనుల పురోగతిని పరిశీలించి పనుల ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకుని నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి విద్యుత్‌ సరఫరా(Power supply)  మరింత మెరుగుపరచాలని సూచించారు.

భీమ్‌ ఘన్‌పూర్‌ 220/132 కేవీ సబ్‌స్టేషన్‌

భీమ్‌ ఘన్‌పూర్‌ 220/132 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించి సబ్‌స్టేషన్‌ నిర్వహణ, విద్యుత్‌ సరఫరా పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భీమ్‌ ఘన్‌పూర్‌ ప్రాంతంలో నీటిపారుదల అవసరాలకు సంబంధించిన విద్యుత్‌ సరఫరా అంశాలపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అధికారులతో సీఎండీ చర్చించి విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన అవసరాలు, సమన్వయం తదితర అంశాలపై వివరాలు తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎస్ఈ  సదానందం, డీఈ పాపిరెడ్డి, డీఈ టెక్నికల్ జగదీశ్ బాబా, ఈఈ సివిల్ వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు .

మరిన్ని వార్తలు