విద్యార్థినులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసిన ఎం ఎల్ ఏ
విద్యార్థినుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత :ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
నిజాంసాగర్ సెప్టెంబర్ 30(విజయక్రాంతి ) కామారెడ్డి జిల్లానిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో(Kasturba Gandhi Girls' School) విద్యార్థినులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ యూనిఫామ్స్, షూస్, టై, బెల్ట్ తదితర సామగ్రిని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు బుధవారం నాడు పంపిణీ చేశారు. విద్యార్థినుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,
నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య,గ్రామ సర్పంచులు,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు.