ప్రతిభ కనబరిచిన ప్రణవి బృందానికి హిందూ వాహిని పురస్కారం
24-09-2026 | 03:56pm
గణపురం, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): మండలంలోని పరశురాంపల్లి గ్రామానికి(Parashurampalli village) చెందిన ఉడుత సంధ్య,తిరుపతి దంపతుల కుమార్తె ప్రణవి బృందం ఉత్తమ ప్రతిభ కనబరిచి హిందూ వాహిని ఆధ్వర్యంలో పురస్కారం అందుకున్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రణవికి జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్,ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ రావు చేతుల మీదుగా పురస్కారం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు ప్రణవిని అభినందించారు.