పుట్టబోయే బిడ్డ కోసం తల్లులు పౌష్టికాహారం తీసుకోవాలి

24-09-2026 | 03:54pm

బోథ్, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి) గర్భిణీ స్త్రీలు(Pregnant women) పుట్టబోయే బిడ్డను దృష్టిలో ఉంచుకొని పౌష్టికాహారాన్ని(Nutritious food)తీసుకోవాలని అంగన్వాడి టీచర్లు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఐదవ అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విటమిన్లతో కూడిన పండ్లు కూరగాయలు ఆకుకూరలపై అవగాహన కలిగించారు. పుట్టిన బిడ్డ ఎదిగేందుకు తల్లి పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు.

కూరగాయలు ఆకుకూరలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇక బిడ్డ పెరుగుతున్న సమయంలో పౌష్టికాహారం అందించాలని కోరారు. సంపూర్ణ ఆహారం తీసుకుంటేనే గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలు ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమంలో మండల కేంద్రంలోని అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు