6 September, 2026 | 4:46 PM

ప్రమాదకరంగా మూల మలుపు

06-09-2026 | 01:29pm

రోడ్డుపై పెద్ద గుంతతో వాహనదారుల ఇబ్బందులు 

గుంతను పూడ్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ 

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 06 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి రామప్ప క్వార్టర్స్, ప్రభుత్వ వైద్య కళాశాల, కేటీకె 8 ఇంక్లైన్ గనికి వెళ్లే దారిలో ఏర్పడ్డ గుంతను పూడ్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు(Aam Aadmi Party District Presidents) కోండ్ర సాయి తేజ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాయి తేజ మాట్లాడుతూ నిరంతరం బొగ్గు లారీలు రాకపోకలు సాగించడం వల్ల మూల మలుపు వద్ద పెద్ద గుంత ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గుంతను పూడ్చివేయాలని ఈ సందర్భంగా సాయితేజ కోరారు.

మరిన్ని వార్తలు