పి,ఆర్,టి,యు జిల్లా అధ్యక్షునికి ఘన సన్మానం
బోధన్, సెప్టెంబర్ 06(విజయ క్రాంతి): ఇటీవల నిజామాబాద్ జిల్లా స్థాయిలో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్(Progressive Recognized Teachers) యూనియన్ తెలంగాణ స్టేట్ (PRTU) ఉపాధ్యాయ సంఘంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా బోధన్ పట్టణానికి చెందిన వీరశైవ లింగాయత్ సమాజ సభ్యులు ఎంబెల్లి శంకర్(Embelli Shankar) ఎన్నిక కావడంతో బోధన్ పట్టణ వీరశైవ జంగమ లింగాయత సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పీఆర్‌టీయూ కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ సమాజ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఎంబెల్లి శంకర్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంబెల్లి శంకర్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, విద్యారంగ అభివృద్ధికి మరింత సేవలందించాలని ఈ సందర్భంగా పలువురు సంఘ ప్రముఖులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో లింగాయత్ రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు, న్యాయస్థాన బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు దేశాయ్, పట్టణ లింగాయత్ సమాజ అధ్యక్షులు, ఏక చక్ర శివాలయాభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మణరావు పటేల్, మాజీ కౌన్సిలర్ కర్నే హనుమంతరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఎంబెల్లి గంగారం, జంగమ సమాజం జిల్లా కన్వీనర్, ఆర్ యుపిపిఎస్ ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు పురాణే అజయ్ కుమార్, ఎస్వి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రవి పటేల్ తదితర పలువురు ఉపాధ్యాయులు, సమాజ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.






