బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్న సబ్ కలెక్టర్

08-09-2026 | 01:12am

భూపాలపల్లి/ కాళేశ్వరం,(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం(Kaleshwaram)లోని శ్రీ ఆది ముక్తిశ్వర స్వామి దేవాలయం(Sri Adi Mukteswara Swamy Temple) వద్ద బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్న సబ్ కలెక్టర్ సౌరబ్ శర్మ(Sub-Collector Saurabh Sharma)  ముందుగా వారికి ఆలయ అర్చకులు మర్యాద పూర్వక స్వాగతం పలికి ఆది ముక్తేశ్వర స్వామి ఆలయ దర్శనం, బాలాలయంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వారిని ఆలయ కార్యనిర్వాణాధికారి ఎస్.మహేష్  స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు. అర్చక స్వాములు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను, పరిశీలించారు వారి వెంట మహాదేవపూర్ ఎమ్మార్వో సత్యనారాయణ స్వామి, ఆర్ అండ్ బి డీఈ దేవేందర్ పాల్గొన్నారు

మరిన్ని వార్తలు