ఓట్ల కోతపై సీఎం బిగ్ బ్లాస్ట్
07-09-2026 | 01:07pm
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి(Ravindra Bharati)లో ప్రముఖ రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొడంగల్ నుంచి వలస వెళ్లిన వేలాది మంది పేదల ఓట్లను ఈసీ తొలగిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కోట్లాది ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని, ఎస్‌ఐఆర్‌ను ఆయుధంగా ఉపయోగించి వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు.
