పోలీసుల దుర్మార్గం.. గొంతు పిసికే ప్రయత్నం
హైదరాబాద్: ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ అసెంబ్లీకి(Telangana Assembly) బయలుదేరారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మా మహిళా సభ్యులపై పోలీసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో రాష్ట్రం మొత్తం చూసిందని తెలిపారు. మాజీ హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి(Former Home Minister Sabitha Indra Reddy) జట్టు పట్టుకొని, గొంతు పిసికే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి లేకుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇనుప కంచెలపై పడేవారని, తెలంగాణ శాసనసభ దుశ్శాసన పర్వంలా మారిందని కేటీఆర్(KTR) మండిపడ్డారు.
డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్, డైవర్షన్ మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Chief Minister Revanth Reddy) తెలుసాని, మహిళలపై దాడిని కప్పిపుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. లోక్ సభకు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ నల్ల టీషర్ట్ లు, స్టిక్కర్లు వేసుకొని వెళ్తారని, మేం మాత్రం టీషర్ట్ లు వేసుకొని అసెంబ్లీకి వెళ్లకూడదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. మిమ్మల్ని ఆపాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారంటూ పోలీసులు తమతో చెబుతున్నారని ఆయన వెల్లడించారు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వనని గతంలో స్పీకర్ అన్నారని, స్పీకర్ ప్రతిపక్ష నేతలపై వివక్ష చూపడం తగదని కేటీఆర్ సూచించారు.
