తాతా మధు కామెంట్స్‌తో.. కాంగ్రెస్‎కు పెరిగిన హీట్

07-09-2026 | 02:25pm

హైదరాబాద్: స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(Thatha Madhu) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయా(Telangana Politics)ల్లో దుమారం రేపుతున్నాయి. మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం.తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఆయనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.అయితే తన వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించి చేసినవి కాదని తాతా మధు వివరణ ఇచ్చారు. అసెంబ్లీ బయట తనను గొంతు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వారిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు.తాతా మధు వివరణతో వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు