సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
18-09-2026 | 07:17pm
భిక్కనూర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipally Venkata Ramana Reddy) సహకారంతో భిక్కనూర్ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన జిల్లెల్ల భూంరెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి మంజూరైన చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిల్లెల లింగారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారు భూంరెడ్డి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.