జియో టవర్ పనులను అడ్డుకున్న గ్రామస్తులు
రుద్రంగి సెప్టెంబర్ 30(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో నిర్మిస్తున్న జియో టవర్(Jio Tower Construction) పనులను అడ్డుకున్న గ్రామస్తులు.ఇప్పటికే ఇండ్ల మధ్యలో రెండు టవర్లు ఉన్నాయని వాటితోనే రేడియేషన్ వచ్చి రోగాల బారిన పడుతున్నామని ఇప్పుడు ఇంటిపైనే జియో టవర్ వేయడం వల్ల మరింత రేడియేషన్ వచ్చి అనారోగ్యా బారిన పడుతామని అన్నారు.గ్రామస్థులు ఎంత చెప్పినా జియో టవర్ సిబ్బంది పనులు అపక పోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.సెంట్రల్ గౌర్నమెంట్ నుండి పర్మిషన్ తెచ్చుకున్నామని పని ఆపడం కుదరదని సిబ్బంది అనడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్రామ సర్పంచ్ కు పోలీసులకు సమాచారం అందించిన పనులు అపకపోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తంచేశారు జియో టవర్ పనులను ఆపాలని ఇండ్ల మధ్యలో జియో టవర్ వేయొద్దని పనులు ఆపాలని చెప్పిన అధికారులు జియో సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అన్నారు. ప్రజల ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకొని జియో టవర్ పనులను ఆపాలని అన్నారు.జియో టవర్ పనులు అపకపోతే ధర్నా చేస్తామని ప్రజలు అన్నారు.తక్షణమే ఇట్టి సమస్యపై జిల్లా అధికారులు స్పందించి పనులను నిలిపివేసి ఇండ్ల మధ్యలో కాకుండా దూరంగా టవర్ వేయాలని కోరారు.....