ఎల్ నినో నేపథ్యంలో భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకోవాలి

30-09-2026 | 07:53pm

బెజ్జూర్, సెప్టెంబర్ 30,( విజయ క్రాంతి ) బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో(Rythu Vedika Office) శుక్రవారం ఎంపీడీఓ బండారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్  సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి. సీతక్క  స్పెషల్ సి.ఎస్  కమిషనర్  సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి వీడియో కాన్ఫిడెన్స్ ద్వారా  మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున, ఇప్పటి నుండే భూగర్భ జలాలను పెంచే దిశగా ప్రతి గ్రామంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వాటర్ షెడ్ పనులు, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్ ల పూడికతీత పనులను వేగవంతం చేయాలన్నారు.రానున్న అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించాలని స్పష్టం చేశారు.గ్రామసభలలో ఉపాధి హామీ పనుల ప్రణాళిక, స్వచ్ఛ భారత్, తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేయాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎంపీడీఓ  మండలంలో చేపట్టిన పనుల వివరాలను మంత్రి కి వివరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు,స తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు