విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలంటూ ఆర్టీసీ డిపో అధికారులకు వినతి...

19-09-2026 | 05:40pm

బాన్సువాడ, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుండి కొత్తబాద్ మోడల్ స్కూల్ (Model School) వెళ్లే విద్యార్థుల కోసం సమయానికి సరిపడా బస్సులు వెయ్యాలని శనివారం బాన్సువాడ ఆర్టీసీ డిపో (Banswada RTC Depot) అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థులకు సకాలంలో పాఠశాలకు వెళ్లేందుకు ఉదయం, సాయంత్రం బస్సులు వేయాలని తాడుకోలు, బుడిమి,కొత్తబాది గ్రామాల మీదుగా మోడల్ స్కూల్ వరకు బస్సులు నడపాలని వారి కోరారు.

బస్సులు సమయానికి రాక పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడం తరగతులు ప్రారంభం కావడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే సమయపాలనకు బస్సులు నడిపి విద్యార్థులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు అధికారులను కోరారు. దీనికి స్పందించిన డిపో అధికారులు ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు