గ్రామాభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలి

19-09-2026 | 06:35pm

ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్ (AICC Secretary Sachin Sawant)అన్నారు. శనివారం  జిల్లా కేంద్రంలోని రోజ్ ఫంక్షన్ హాల్‌లో ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని సర్పంచులకు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సచిన్ సావంత్ మాట్లాడుతూ.. గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.

గ్రామాల అభివృద్ధిలో స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ లక్ష్యాలు, స్థానిక పాలన, సర్పంచుల బాధ్యతలపై రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ తెలంగాణ ఇన్‌చార్జి, నేషనల్ సెక్రెటరీ బి.సుభాష్ యక్కర అవగాహన కల్పించారు.డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ.. సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు.

మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చొరవ చూపాలన్నారు. ప్రజల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషించాలని అన్నారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోరే సంతోష్, RGPRS రాష్ట్ర చైర్మన్ మార్కా రాజేంద్ర ప్రసాద్ యాదవ్, జిల్లా కోఆర్డినేటర్ కోవ ఇందిర, జాఫర్, నవీన్, జ్యోత్స్న నాయక్, సమీనా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు