పద్మనగర్‌లో పలుచోట్ల బాంబు స్క్వాడ్ తనిఖీలు

19-09-2026 | 07:28pm

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్ళపల్లి మండలం పద్మనగర్‌లో రహదారి వెంట పలు ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు(Bomb squad checks) నిర్వహించారు. రోడ్డు పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. బాంబు స్క్వాడ్ సిబ్బంది రహదారి వెంట క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడంతో స్థానికుల్లో కొంత ఆసక్తి నెలకొంది. తనిఖీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం లేదు.

మరిన్ని వార్తలు