నీటి ట్యాంకు కు మరమ్మతులు చేయించాలి...
తాడ్వాయి,సెప్టెంబర్,19( విజయ క్రాంతి): గ్రామంలోని 20 వేల సామర్థ్యం గల నీటి ట్యాంకుకు వెంటనే మరమ్మత్తులు చేయించాలని గ్రామ సర్పంచ్ రాజా గౌడ్ కోరారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి (Brahmanpalli) గ్రామంలో శనివారం జల్ జీవన్ మిషన్ లో భాగంగా హర్ ఘర్ జల్ పై ప్రత్యేక గ్రామసభ (Gram Sabha) నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న నీటి ట్యాంకు పైకప్పుకు పెచ్చులూడుతున్నాయని వెంటనే మరమ్మతులు నిర్వహించి నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్సీ కాలనీలో 20 ఇండ్లకు నీళ్లు రావడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి నీళ్లు అందించేలా చూడాలని కోరారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రశాంత్ మాట్లాడుతూ.. గ్రామంలో జల్ జీవన్ మిషన్ లో భాగంగా హర్ ఘర్ జల్ లక్ష్యంగా ప్రతి ఇంటికి టాప్ కనెక్షన్ అందించి నీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గ్రామంలో 613 నల్లా కలెక్షన్లు ఉన్నాయని తెలిపారు.4 వాటర్ ట్యాంకులు,4 త్రీ ఫేస్ మోటార్లు, 5 సింగిల్ పేస్ మోటార్లు ఉన్నాయని, వీటి ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు.ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, కార్యదర్శి వీరేష్, వార్డు సభ్యులు నారోజ్, సాయికుమార్, రాజు, నవీన్ గౌడ్, నారాయణ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.