తెలంగాణ అసెంబ్లీ ఎన్నిగంటలు నడిచిందో తెలుసా?

19-09-2026 | 07:32am

అసెంబ్లీ సమావేశాలు.. 1.40 గంటలే వినియోగించుకున్న బీఆర్ఎస్

51 గంటల 52 నిమిషాలు నడిచిన అసెంబ్లీ 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly) మొత్తం ఎనిమిది రోజులు జరిగాయి. 51 గంటల 52 నిమిషాలు అసెంబ్లీ నడిచింది. శాసనసభలో 25.38 గంటల సేపు మంత్రులు మాట్లాడారు. అసెంబ్లీలో కాంగ్రెస్ 12.21 గంటలు, బీఆర్ఎస్ 1.40 గంటలు, బీజేపీ 5 గంటలు, ఎంఐఎం 4.14 గంటలు, సీపీఐ 2.59 గంటల సమయాన్ని వినియోగించుకున్నాయి. తెలంగాణ వర్షాకాల సమావేశాలు(Telangana Monsoon Session) సందర్భంగా బీఆర్ఎస్ సభ్యలను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

8 రోజుల పాటు సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కొనసాగిన సభలో ప్రశ్నలు, చర్చలు, సభ్యుల ప్రసంగాలు, ప్రభుత్వ ప్రకటనలు, బిల్లుల ఆమోదంతో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి భూములపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యల భూములు దోచుకున్నారంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లో రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు