గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో విజిలెన్స్ తనిఖీలు

19-09-2026 | 01:56pm

ఇబ్రహీంపట్నం,సెప్టెంబర్ 19(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో(Guru Nanak Engineering College) విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు  తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు సంబంధించిన రికార్డులు, కళాశాల రికార్డులు, ప్రొఫెసర్ల వివరాలు, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన డేటా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కళాశాల రికార్డులు ఉన్నాయా, స్కాలర్‌షిప్‌ల వివరాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, అడ్మిషన్లలో నమోదైన సమాచారాన్ని,బట్టి మున్సిపాలిటీకి సంబంధించిన ట్యాక్సీలపై కూడా ఆరా తీస్తున్నారు. బిల్డింగ్ నిర్మాణాలు ఎప్పుడు జరిగాయి,అనే తదితర అంశాలపై తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల అనంతరం పూర్తి వివరాలు  తెలియాల్సింది ఉంది.

మరిన్ని వార్తలు