పోలీస్ తానాలో వినాయక అన్నదానం
శాంతియుతంగా, సాంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించుకోవాలి :డీఎస్పీ శ్రీనివాస్ రావు
సదాశివనగర్,సెప్టెంబర్ 18(విజయక్రాంతి): మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో (Local police station)వినాయక మండపం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు.వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాలకు చెందిన వినాయక ఉత్సవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులకు వినాయక చవితి వేడుకలను సాంప్రదాయ బద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా DJలు మరియు అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్స్ వినియోగించకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేడుకలు నిర్వహించాలని సూచించారు.
అలాగే నిమజ్జన ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, పోలీసు శాఖ సూచనలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. అన్ని వర్గాల ప్రజల మధ్య శాంతి, సామరస్యం మరియు సోదరభావం కొనసాగించే విధంగా పండుగను జరుపుకోవాలని పోలీసులు కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ వీరయ్య,
సదశివనగర్ ఎస్ఐ పుష్పరాజ్,తాడ్వాయి ఎస్ఐ నరేష్, గాంధారి ఎస్ఐ మహేందర్,సదాశివనగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.