పేకాట రాయుళ్లు అరెస్ట్..
18-09-2026 | 11:53pm
ఉట్నూర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఉట్నూర్ పోలీస్ డివిజన్ పరిధిలోని ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్(Indravelli Police Station) పరిధిలో ఉన్న దన్నోరా(బీ) గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. విశ్వాసనీయ సమాచారం మేరకు పేకాట ఆడుతున్న స్థలానికి పోలీసులు చేరుకొని పేకాట ఆడుతున్న నలుగురు వద్ద 3500 నగదుతో పాటు బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై విలేకరులతో మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో డీజేలు, పేకాట ఆడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందుకు విరుద్ధంగా పేకాట ఆడిన, డీజేలు ఏర్పాటుచేసిన చట్ట రిక్త చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.