పూల పండుగ బతుకమ్మ

11-10-2026 | 10:53am

ఎర్రుపాలెం, అక్టోబర్ 11 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని సర్దార్ జమలాపురం కేశవరావు మెమోరియల్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు (Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ నాగిరెడ్డి సౌజన్య అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, ఆచారాలకు (Culture and Traditions) ప్రతీక అని పేర్కొన్నారు.

విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను బతుకమ్మ పండుగ ద్వారా తెలియజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. నేటి ఆధునిక కాలంలో (Modern Era) భావితరాలకు మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయాలనే లక్ష్యంతో కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు బతుకమ్మ పాటలు (Traditional Songs) పాడుతూ కోలాటాలతో సందడి చేశారు. వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు మొదటి, రెండో, మూడో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, కళాశాల యాజమాన్య సభ్యులు మిరియాల శ్యాంప్రసాద్, ఐలూరి శ్రీనివాసరెడ్డి, గోపి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు