రాహుల్ గాంధీవి పచ్చి అబద్ధాలు

11-10-2026 | 05:20am
  1. రాష్ట్రపతి ఆధారాలు చూపించమంటే పారిపోయావ్
  2. ఆమె ‘ఓట్ చోరీ’ని ఒప్పుకున్నారనడం సిగ్గుచేటు
  3. రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ..దమ్ముంటే డిలీట్ ఓట్లను చూపించండి
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాం తి): కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసిన తర్వాత, బయటకు వచ్చిన రాహుల్ గాంధీ మీడియా ముందు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ.. ఇంకో కొత్త నాటకానికి తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాం చందర్‌రావు(BJP State President Ramchander Rao) తెలిపారు. తాము చెప్పిన ఆరోపణలకు రాష్ట్రపతి ఆధారాలు అడిగారని స్వ యంగా రాహుల్ గాంధీయే చెప్పారని, తీరా చూస్తే వాళ్ల దగ్గర సమర్పించడానికి ఎలాం టి ఆధారాలూ లేవన్నారు.

చేతిలో ఒక్క ఆధారం కూడా లేకపోయినా, చివరకు దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతియే ఓటు చోరీని ఒప్పుకున్నారంటూ సి గ్గులేకుండా ప్రచారం మొదలుపెట్టారని ఫైరయ్యారు. తెలంగాణలో ఇటీవల పూర్తయిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో బలంగా తిప్పికొట్టాలని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.

శనివారం హైదరాబాద్‌లో ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆల్ సెల్స్ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బోగస్ ఓట్లను తొలగించి పారదర్శకంగా జాబితాను రూ పొందిస్తే, వరుస ఎన్నికల ఓటములతో భ యపడిన రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ చేస్తున్న ఓట్ చోరీ నాటకాలను ఎండగడుతూ, స్వచ్ఛమైన ఓట ర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి చేకూరే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తోందన్నారు. అధికార యంత్రాంగంతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీల బీఎల్‌ఏలు స్వయంగా సంతకాలు పెట్టి, కళ్లారా చూసి పర్యవేక్షించిన ఇంతటి పారదర్శక ప్రక్రియను కూడా,

కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓటమి భయంతో కాంగ్రె స్ కావాలని తప్పుడు కథనాలతో ప్రశ్నించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమ న్నారు. గతంలో ఎన్నికల కమిషనర్లను రాజకీయ బానిసలుగా మార్చి పదవులిచ్చిన ఘ న చరిత్ర కాంగ్రెస్‌ది కాదా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 95 కోట్ల మంది ఓట ర్లలో ఫారం-7 ద్వారా తొలగించినవి కేవలం 29 లక్షల ఓట్లు మాత్రమేనని అన్నారు. ఇవన్నీ వెరిఫికేషన్ అయి మళ్లీ కొన్ని యాడ్ అవుతాయన్నారు. 

రాహుల్ గాంధీని పీఎం చేసేందుకే..

తెలంగాణలో రేవంత్‌రెడ్డికి కూడా ద మ్ముంటే డిలీట్ అయిన ఒక్క ఓటరును ప్రజ ల ముందుకు తీసుకురావాలని రాంచందర్‌రావు సవాల్ విసిరారు. చనిపోయిన వారు, డూప్లికేట్లు, వేరే ప్రాంతాలకు మారిన వారి పేర్ల ఏరివేతను తప్పుపట్టడం హాస్యాస్పదమన్నారు.

దీన్ని ‘ఓట్ చోరీ’ అనడం ప్రజలను మోసగించడమేనన్నారు. దేశాన్ని, రాజ్యాంగ సంస్థలను అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రె స్ చేస్తున్న ఈ క్యాంపె యిన్ను వైద్యులు, ఇం జనీర్లు, లాయర్లు, మేధావులు, బీజేపీ శ్రేణు లు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు కనీసం 10 రోజుల ముందస్తు నోటీస్ ఇవ్వాల్సి ఉండగా, కేవ లం 3 రోజుల ముందు దరఖాస్తు చేశారని తెలిపారు. 

మరిన్ని వార్తలు