పూల పండుగ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక
ఎర్రుపాలెం, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): మండల పరిధిలోని బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలను (Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆర్. రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రకృతితో మమేకమైన ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ప్రకృతిలో భగవంతుడు సృష్టించిన రంగురంగుల పూలతో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం తెలంగాణ సంప్రదాయమని తెలిపారు.
ఆధునిక యుగంలోనూ సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) పాటిస్తూ, విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ భావితరాలకు వాటిని అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.