దూసుకొస్తున్న సౌర తుఫాను
భూమి వైపు సౌర తుపాను.. భారత్‌కు ముప్పు ఉందా?
సూర్యుడి నుంచి వెలువడిన శక్తిమంతమైన కణాల మేఘాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. దీంతో అక్టోబర్ 11న మధ్యస్థాయి G2 Geomagnetic Storm ఏర్పడే అవకాశం ఉందని అమెరికా అంతరిక్ష వాతావరణ అంచనా సంస్థ NOAA హెచ్చరించింది. ఈ సౌర తుఫాను ప్రభావంతో ఉపగ్రహాలు, రేడియో సంకేతాలు, GPS నావిగేషన్ వ్యవస్థల్లో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడే అవకాశముంది. అయితే తుపాను తీవ్రత అప్పటి అంతరిక్ష వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
భారత్‌పై ప్రభావం ఎంత? ప్రస్తుత అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా లేదా ఇంటర్నెట్ నిలిచిపోతుందని చెప్పడానికి ఆధారాలు లేవు. సౌర తుపాను వల్ల ధ్రువ ప్రాంతాల్లో అరోరా అనే రంగురంగుల కాంతులు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ, భారత్‌లో విస్తృతంగా కనిపిస్తాయని చెప్పలేం. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తాజా పరిస్థితుల కోసం NOAA విడుదల చేసే Space Weather Updatesను గమనించడం మంచిది.