మణికొండలో అక్రమ నిర్మాణాలపై యాక్షన్

10-10-2026 | 01:45pm
  1. మణికొండలో అనుమతుల్లేని నిర్మాణంపై అధికారుల కొరడా!
  2. చిత్రపురి కాలనీలో అదనపు అంతస్తుల వ్యవహారంపై షోకాజ్ నోటీసు
  3. సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్న నార్సింగి సర్కిల్ టీపీఓ  రమేష్

మణికొండ, విజయక్రాంతి: మణికొండలో అనుమతుల్లేని నిర్మాణాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చిత్రపురి కాలనీలోని(Chitrapuri Colony) విల్లా నంబర్ 228 వద్ద స్టిల్ట్‌తో పాటు రెండు అదనపు అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation officials ) నార్సింగి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించారు. సంబంధిత యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేసి, నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, ఆమోదిత ప్లాన్‌లు, ఇతర పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. కె. శ్రీనివాస్ తదితరులు చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు నిర్మాణ స్థలాన్ని పరిశీలించినట్లు నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లు ఆరోపిస్తూ, పనులు నిలిపివేయాలని స్పష్టం చేశారు. నోటీసుకు నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని, ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని సూచించారు.

సోమవారం క్షేత్రస్థాయి పరిశీలన

ఈ నిర్మాణ వ్యవహారంపై నార్సింగి సర్కిల్ టీపీఓ పీఎస్ రమేష్ స్పందిస్తూ, సోమవారం నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో సంబంధిత నిర్మాణంపై అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు