పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శెట్టిపల్లి సంగిరెడ్డి

17-10-2026 | 01:37pm

ఎర్రుపాలెం, అక్టోబర్ 17 (విజయక్రాంతి): మండలంలోని రామన్నపాలెం గ్రామానికి చెందిన శెట్టిపల్లి సంగిరెడ్డి పీఆర్టీయూ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా (vice president) ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ సంఘంలో నిబద్ధతతో పనిచేస్తూ, పలు బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన ఆయనకు రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యత దక్కింది.గతంలో మండల అధ్యక్షుడిగా (mandal president), జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగిరెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, సంఘ బలోపేతానికి విశేష కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర సంఘం ఈ అవకాశం కల్పించింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు (district president) కట్టా శేఖర్‌, ప్రధాన కార్యదర్శి రంగారావుతో పాటు మండల అధ్యక్షుడు మదన్మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. బాబూరావు సంగిరెడ్డిని అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఆయన మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.


మరిన్ని వార్తలు