గ్లోబల్ మార్కెట్లో కలకలం
రష్యా ఆయిల్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఒక్కరోజు ముందే షాక్!
భారత్, చైనాకు భారీ ఊరట!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) అనూహ్యంగా వెనక్కి తగ్గారు. భారత్, చైనా వంటి ప్రధాన దేశాలకు భారీ ఆర్థిక భారం కలిగించే అవకాశం ఉన్న 100% Tariffs అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌లో రష్యా, ఇరాన్‌పై ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై సంతకం చేసిన ట్రంప్.. కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే మినహాయింపులు ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
Russian Oil Imports అంశంలో అమెరికా అనుసరిస్తున్న విధానంలో ఈ పరిణామం కీలక మలుపుగా భావిస్తున్నారు. రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగించే దేశాలపై సుంకాల రూపంలో ఒత్తిడి పెంచేందుకు రూపొందించిన చట్టం ప్రకారం, అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లభించింది. అయితే, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సుంకాలు, సంబంధిత ఆంక్షల అమలును మినహాయించే నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.
India-US Trade Relations నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. భారత్‌కు రష్యా(India Russia Oil Trade) నుంచి ముడి చమురు దిగుమతులు కీలకం కావడంతో, అదనపు అమెరికా సుంకాలు అమలైతే భారత ఎగుమతులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉండేది. తాజా మినహాయింపుతో తక్షణానికి ఆ ముప్పు తగ్గినప్పటికీ, ఈ ఉపశమనం శాశ్వతమని చెప్పలేం. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మళ్లీ చర్యలు తీసుకునే అవకాశం అమెరికా వద్ద ఉంది. మరోవైపు, ఈ పరిణామం Global Oil Market, అంతర్జాతీయ వాణిజ్యం, భారత్-అమెరికా ఆర్థిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.