పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
- సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలి
- పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలి
కూసుమంచి, సెప్టెంబర్ 17: ప్రభుత్వం (Government)ఏర్పాటు చేసిన వెంటనే పీఆర్సీని అమలు చేస్తామని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో(Election Manifesto) ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు పీఆర్సీ అమలు చేయకపోవడం, సీపీఎస్‌ను రద్దు చేయకపోవడం పట్ల పిఆర్టియు టీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ కట్టా శేఖర్ రావు (Sri Katta Sekhar Rao) ఆవేదన వ్యక్తం చేశారు.
కూసుమంచిలో జరిగిన పిఆర్టియు టీఎస్ కూసుమంచి మండల శాఖ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పీఆర్సీ అమలు ఆలస్యం కావడం, సీపీఎస్ కొనసాగడం, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు విడుదల కాకపోవడం వల్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు
పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేసి, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నెరవేర్చి పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు.
ప్రభుత్వంలో భాగస్వాములైన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రభుత్వంగా తన బాధ్యతను నెరవేర్చాలని కట్టా శేఖర్ రావు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో పిఆర్టియు టీఎస్ కూసుమంచి మండల అధ్యక్షులు ఎస్. ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం. సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రంగారావు, పిఆర్టియు మాసపత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యులు జి. వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కె.వి. కృష్ణారావు, సాదె వెంకన్న, రాజశేఖర్, మల్లికార్జున్, రాష్ట్ర కార్యదర్శులు ఏ. లక్ష్మీనారాయణ, కె. అనంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. సోమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పి. శోభన్ బాబు, సర్వర్ మియా, కృష్ణ, పాపారావు, కృష్ణవేణి, విజయ, రూపిణి, రవళి, చైతన్య, రాజ్యలక్ష్మి తదితరులు, పిఆర్టియు సభ్యులు పాల్గొన్నారు.