జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు పూర్తి
30-09-2026 | 03:36pm
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ గిరిజన సంక్షేమ మోడల్ క్రీడా పాఠశాలలో(Tribal Welfare Model Sports School) బుధవారం సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.ముఖ్య అతిథులుగా గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఉపసంచాలకుడు జాదవ్ అంబాజీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్రే అనిల్ హాజరై క్రీడాకారులను అభినందించారు.
ప్రతిభ కనబరిచిన 40 మందిని ఎంపిక చేసి అక్టోబర్ 11న ఆసిఫాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టుగా పంపనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుండం లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి మడావి శేఖు, జీసీడీవో శకుంతల, కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.