రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి

30-09-2026 | 04:08pm

కేవీకే తునికి శాస్త్రవేత్త ఉదయ్ కుమార్, ఏవో శ్రీనివాస రాజు

పాపన్నపేట,సెప్టెంబర్30: రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసేందుకు మొగ్గు చూపాలని కృషి విజ్ఞాన కేంద్రం(కేవికే)(Krishi Knowledge Center) తునికి శాస్త్రవేత్త ఉదయ్ కుమార్, స్థానిక ఏవో శ్రీనివాస రాజు సూచించారు. బుధవారం చికోడ్ గ్రామంలో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) సౌజన్యంతో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంతో కలిగే లాభాలు, జీవన ఎరువులు, రాబోయే యాసంగిలో సాగు చేసే పంటల గురించి వివరంగా రైతులకు వివరించారు.

నానో యూరియా, నానో డీఏపీ, ఆర్గానిక్ కార్బన్, సేంద్రియ కర్బనం లభ్యత గురించి వివరించారు. యాసంగిలో సాగు చేసే పంటల గురించి తెలుపుతూ వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. నూనె గింజలు, పప్పు దినుసు పంటల సాగుకు మొగ్గు చూపాలన్నారు. ఎకరం వరి సాగు చేయడానికి బదులుగా రెండు, మూడు ఎకరాల ఆరుతడి పంటలను పండించుకోవచ్చని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో చికోడ్ పీఏసీఎస్ చైర్మన్ దత్తరాజు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు