6 September, 2026 | 3:40 PM

ఘనంగా జర్నలిస్టు దినోత్సవం

06-09-2026 | 02:53pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జర్నలిస్టు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్(Lions Club) ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రమణారెడ్డి(Ramana Reddy) మాట్లాడుతూ.. జర్నలిస్టులు(Journalists) ప్రతిరోజూ సమాచారాన్ని సేకరించి ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సామాజిక దృక్పథంతో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సేవలను అభినందించారు.

అనంతరం జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టులు రావుల శంకర్, వేణుగోపాల్, చిప్ప సురేష్, మహేష్, రాజు, వెంకటేష్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక కన్వీనర్ ఫయాజ్, లయన్స్ సభ్యులు శంకర్, వెంకటేశ్వర్లు, తారిక్, వేణు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు