6 September, 2026 | 3:42 PM

కేసీఆర్ 'ప్రతిపక్ష నేత'గా రాజీనామా చేయండి

06-09-2026 | 02:46pm

పేదల సొంతిల్లు కల.. పదేళ్లలో నెరవేరలేదు

హైదరాబాద్: సొంతిల్లు కట్టుకోవాలనే పేదల కల.. పదేళ్లపాటు నెరవేరలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 2500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతిపేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ.. సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు.

ఉన్నత చదువులు చదివితే సరిపోదన్న మహేశ్ గౌడ్ సంస్కారం కూడా ఉండాలనేది కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) గ్రహించాలని హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ప్రజలు పోరాడి స్వరాష్ట్రం సాధించుకున్నారని ఆయన వివరించారు. కానీ తెలంగాణ వచ్చాక.. నిధులు, నియామకాలు కేవలం కేసీఆర్ కుటుంబానికే దక్కాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుల(Telangana activists) కుటుంబాలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు.

ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాకు కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) న్యాయం చేయాలని మహేశ్ గౌడ్(Mahesh Kumar Goud) డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేయొద్దని కోరారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇస్తే.. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి నేత పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని సూచించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం చేతకాకపోతే ఆ పాత్ర మరొకరికి ఇవ్వాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కృషి వల్ల హైదరాబాద్ రూపురేఖలు మారుతున్నాయన్నారు. హైదరాబాద్ కు అనుబంధంగా ఫ్యూచర్ సిటీ(Future City) మరో గొప్ప నగరంగా ఎదుగుతోందని తెలిపారు.


మరిన్ని వార్తలు