5 September, 2026 | 8:14 PM

మీ పథకాలను మరింత మెరుగా ఇస్తున్నాం

05-09-2026 | 07:11pm

హైదరాబాద్: నల్గొండ జిల్లా(Nalgonda District)లోని నకిరేకల్ లో రూ.345 కోట్లతో 12 రకాల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), రూ.32 కోట్లతో నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి(100 bed government hospital)ని ప్రారంభించారు. అనంతరం రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. నకిరేకల్ గడ్డా.. కాంగ్రెస్ అడ్డా అని వేముల వీరేశం నిరూపించారని, వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధికి అండగా ఉండాలని వీరేశం ఆయనను కోరారని, అంతేకాకుండా ఈ సభకు వేలమంది అభిమానులు తరలివచ్చారని తెలిపారు. 

ప్రజా ప్రభుత్వానికి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నామని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారి చరిత్రను ప్రజలు గమనించాలని, గత ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకాన్ని అయినా రద్దు చేశామని, మీరు ఇచ్చిన పథకాలను మరింత మెరుగా ఇస్తున్నామని ఆయన చెప్పారు. మా ప్రభుత్వ కార్యక్రమాలతో గత ప్రజత్వాన్ని బేరీజ వేయండి. గత ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకాన్ని అయినా రద్దు చేశామా.. అరి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రైతులు అనేక రకాలుగా మోసపోయారని, చివరి విడత రైతుభరోసా నిధులు వేయకుండానే గద్దె దిగిపోయారు. 

మరిన్ని వార్తలు