భూభారతిలో పెద్ద కుంభకోణం దాగి ఉంది
బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రవీణ్ కుమార్
కౌటాల(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తీసుకువచ్చిన భూభారతి(Bhubharati)లో పెద్ద కుంభకోణం దాగి ఉందని బిఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ఆరోపించారు. కౌటాల మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం సోదరులు దోపిడీలకు పాల్పడితే , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కంపెనీ పేరుతో కోట్ల రూపాయల రుణాలు పొందుతున్నారని దీంతోపాటు వందలకోట్ల 10 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసేది చూడగా పోలీసులు పెట్టుకోవడంతో వారిని సస్పెండ్ చేసిన పరిస్థితి ఉందన్నారు. సీనియర్ నాయకులు ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ ఇవ్వకుండానే భూములను లాక్కునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు ఎకరాల్లో ఒక ఎకరం ఇస్తే మళ్లీ పట్టాలు చేస్తామని కొంతమంది బ్రోకర్లు తిరుగుతున్నారని ఆరోపించారు. స్థానికంగా కాంగ్రెస్ నాయకుడు పొద్దున వెళ్లేటప్పుడు సంచుల డబ్బులు పెట్టుకొని నాయకులకు ధర కట్టి కొంటున్నాడు అని ఆరోపించారు.






